బిగ్‌బాస్ తెలుగు సీజన్-8 విజేతగా నిఖిల్ మలియక్కల్ గెలిచాడు. రెండు రోజుల క్రితం జరిగిన బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలో నిఖిల్ విన్నర్ కాగా గౌతమ్ రన్నర్ అయ్యాడు. అయితే విన్నర్ అవ్వగానే ట్రోఫీ తీసుకొని నిఖిల్ తన లవర్ కావ్యశ్రీ దగ్గరకి వెళ్తాడని ఫ్యాన్స్ అందరు అనుకున్నారు. దీనికి హౌస్‌లో నిఖిల్ చెప్పిన మాటలే కారణం. బిగ్‌బాస్ గేటు దాటిన మరుక్షణం నా లవర్‌ని కలుస్తానంటూ నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు కావ్యశ్రీ పేరే ఎత్తడం లేదు.
కావ్యశ్రీ ముందే చెప్పింది.. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని కానీ నిఖిల్ ఫ్యాన్స్ అంతా కావ్యశ్రీని తప్పుపట్టారు. ఇప్పుడేమో బెంగుళూరు వెళ్లి అక్కడ డ్యాన్స్ లతో ఎంజాయ్ చేస్తున్నాడు నిఖిల్. కొన్ని గంటల క్రితం నైనికతో కలిసి ఓ డ్యాన్స్ వీడియోని అప్లోడ్ చేశాడు. అయితే ఆ వీడియోకి చాలా కామెంట్లు వస్తున్నాయి. అందులో చాలావరకు కావ్యశ్రీని అర్థం చేసుకో.. వదిలేయకు..తన దగ్గరికి వెళ్తా అన్నావ్ కదా.. ఇప్పుడేమో డ్యాన్స్ లు చేస్తున్నావంటూ నెటిజన్లు తిడుతున్నారు.
కావ్య ఎక్కడ నిఖిల్? హౌస్‌లో ఉన్నప్పుడు నా అమ్మ.. లవ్ నా ప్రాణం అన్నావ్.. కావ్య నిన్ను దూరం పెడుతుందన్నట్లు కలరింగ్ ఇచ్చావ్.. ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావ్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చెప్పినవన్నీ అబద్దాలేనా.. గెలవడానికి బ్రేకప్ అయినట్టు చెప్పాడా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.